తెలుగు కొత్త సంవత్సరం మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. విశ్వావశునామ సంవత్సరం ( వార్త రాసే రోజుకు చివరివారంలో ఉన్నాం. ఈ ఏడాది ఉగాది రోజు ( మార్చి 19) కూడా కొద్దిపాటి అమావాస్య ఘడియలు ఉన్నాయి.. ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి. పండితులు ఏమంటున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి.ఈ పండుగ అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.. పంచాంగ శ్రవణం.తెలుగు ప్రజలు ఆ రోజును ( మార్చి 19) ఎంతో ఆనందంతో కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను నిర్వహిస్తారు.ఈ ఏడాది ( 2026) పరాభవ నామ సంవత్సరం మార్చి 19 ఉదయం మార్చి 19న ఉదయం 6:52 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజు అప్పటి వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. తెలుగు సంప్రదాయంలో ఉగాది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు నాంది పలికే ప్రత్యేకమైన పండుగగా భావిస్తారు.
పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ద పాడ్యమి తిథి వివరాలు
- ఉగాది పండుగ .. చైత్ర శుద్ద పాడ్యమి తిథి ప్రారంభం : మార్చి 19 ఉదయం 6.53 గంటలకు
- చైత్ర శుద్ద పాడ్యమి తిథి ముగింపు: మార్చి 20 ఉదయం 4:52 గంటలకు
ఉగాది రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవునికి పూజలు చేస్తారు.అనంతరం ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.
పండుగ రోజు ఇలా చేస్తే శుభాలే..
- ఉగాది పండుగ ప్రకృతితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది.
- ఇది వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.
- ఈ సమయంలో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఆరు రుచులతో చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని పెద్దలు చెబుతారు.
- వాతావరణ మార్పులతో వచ్చే కొన్ని వ్యాధులను దూరం చేయడంలో ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు.
- ఉగాది రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడతారు.
- ఆ తరువాత కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజలు చేస్తారు.
- చాలా మంది ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
